Tuesday, April 30, 2013

వై-ఫై (Wi-Fi) అంటే…......

వైర్‌లెస్‌ ఫిడెలిటి(Wi-Fi),WIRELESS FIDELITY…ఇది రేడియో సంకేతాల ఆధారంగా పనిచేసే వైర్‌లెస్‌ టెక్నాలజీ. ఎలాంటి తీగలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేకుండా నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని అందించే అద్భుతమిది. ఇందులో వైర్‌లెస్‌ యాక్సెస్‌ పాయింట్‌ (డబ్ల్యుఎపి)ది ప్రధాన పాత్ర. దీనినే రౌటర్‌(Router) అని కూడా పిలుస్తారు. ఒక్క రౌటర్‌ ద్వారా ఇంట్లో వై-ఫై ఎనేబుల్డ్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. కంప్యూ టర్‌ను ఆన్‌ చేయగానే దానికి ఏర్పాటు చేసిన వైర్‌లెస్‌ ఎడాప్టర్‌ సమాచారం మొత్తాన్ని రేడియో సంకేతాలుగా మార్చి యాంటెన్నా ద్వారా గా ల్లోకి ప్రసారం చేస్తుంది.ఆ సంకేతాలను రౌటర్‌ సంబంధిత ఇంటర్‌నెట్‌ కనెక్షన్లకు అందచేస్తుంది. ఇదే ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతూ నెట్‌ నుంచి వచ్చిన సమాచారాన్ని రౌటర్‌ రేడియో సంకేతాల రూపంలో ఎడాప్టర్‌కు అందజేస్తే…ఎడాప్టర్‌ ఆ సమాచారాన్ని మనకు తెలియచేస్తుంది. 

Note: సమాచార రంగంలో వచ్చిన ఈ కొత్త విప్లవం ఇక్కట్లను కూడా తెచ్చి పెడుతోంది. అజాగ్రత్త వహిస్తే వ్యక్తిగత సమాచారాన్ని,ఇ-మెయిల్స్‌, కం ప్యూటర్‌లోని ప్రతీ సమాచారాన్ని ఎవరైనా తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది.
వై-ఫై (Wi-Fi) జాగ్రత్తలు :
1.వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగించుకుంటున్నవాళ్లు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రౌటర్‌ను ఆన్‌ చేయగానే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ తెరపై కనిపించే నెట్‌వర్క్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తోనే కంప్యూటర్‌ వై-ఫై సంకేతాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల బయటి వ్యక్తులు మీ సంకేతాలను వాడుకునే అవకాశం ఉండదు
2. పాస్‌వర్డ్‌ను తరచూ మారుస్తుండాలి. పాస్‌వర్డ్‌లో అక్షరాలతోపాటు అంకెలు ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఇంటర్‌నెట్‌ను వినియోగించని సమయంలో రౌటర్‌ను తప్పనిసరిగా స్విచాఫ్‌ చేసి పెట్టాలి.
3.మీ నెట్‌వర్క్‌ను ఎవరైనా యాక్సెస్‌ చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే మీకు వై-ఫై కనెక్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన ఇంజనీరును సంప్రదించి యాక్టివిటి లాగ్‌ గురించి తెలుసుకోవాలి. యాక్సెస్‌ పాయింట్‌ వద్ద డైనమిక్‌ హోస్ట్‌ కంట్రోల్‌ ప్రొటోకాల్‌ ఫంక్షన్‌ను డిసేబుల్‌ చేసి ఐపి అడ్రస్‌ను మాన్యువల్‌గా ఇవ్వాలి.

4.నెట్‌వర్క్‌ యాక్సెస్‌కు, లోకల్‌ కంప్యూటర్లకు ఐపి అడ్రస్‌లను మాన్యువల్‌గా ఇస్తే ఇతరులు మీ నెట్‌వర్క్‌ను వినియోగిం చుకోవటం సాధ్యం కాదు. యాక్సెస్‌ సెట్టింగ్స్‌లో అక్షరాలతో రూపొందించిన పాస్‌ కీ (వైర్‌లెస్‌ ఎన్‌స్క్రిప్షన్‌ ప్రొటోకాల్‌) ఎప్పుడూ ఎనేబుల్‌ అయి ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వైర్‌లెస్‌ డివైస్‌ నుంచి నెట్‌ను వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా పాస్‌ కీ అవసరమవుతుంది. అపుడు బయటి వ్యక్తులు మీ కనెక్షన్‌ను ఉపయోగించుకోలేరు. తరచూ ఈ పాస్‌ కీని కూడా మారుస్తుండాలి. మీ సిస్టంకు ఈ సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే start->run->cmd లోకి వెళ్లి అక్కడ ipconfig/all అన్న కమాండ్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
5.ఒకవేళ mac అడ్రస్‌ ఉంటే access settings->access control లోకి వెళ్లి  అడ్రస్‌ల ఆధారంగానే నెట్‌వర్క్‌ వాడుకునేలా నిబంధన ఏర్పాటు చేసుకోవచ్చు. సిస్టంలోని ఇంటర్‌నెట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయటం ద్వారా ఎంతమంది మీ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటున్నారన్నది కూడా తెలుసుకునే వీలుంది. ఇతరుల మీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోకుండా చూసుకోవాలంటే తరచూ ఇంటర్‌నెట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసిచూస్తుండాలి. దాంతోపాటు అడ్మిన్‌ పాస్‌వర్డ్‌లను కూడా తరచూ మారుస్తుండాలి.
 6. యూజర్‌నేం, పాస్‌వర్డ్‌ పెట్టుకోకుండా వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగించుకుంటూ రౌటర్‌ను ఆన్‌ చేస్తే సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలా రౌటర్‌ ఆన్‌ చేయగానే యాభై నుంచి వంద మీటర్ల మేర వై-ఫై సదుపాయం ఉండి ఆన్‌చేసి ఉన్న అన్ని కంప్యూటర్లకు మీ నెట్‌వర్క్‌ అనుసంధానమవుతుంది. అపుడు బయటి వ్యక్తులు మీకు తెలియకుండానే మీ నెట్‌వర్క్‌ను దేనికోసమైనా వాడుకునే ప్రమాదం ఉంది.

7.మీ వైఫై నెట్‌వర్క్‌ను మీరు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటే ఇన్‌స్టాలేషన్ సమయంలోనే దానికి ఒక సీక్రెట్ కోడ్ లేదా పాస్‌వర్డ్ ఇచ్చుకోవాలి. మీకు ఇంటర్నెట్ అవసరం ఏర్పడినప్పుడు.. వైఫై ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీ వద్ద ఉన్న వైఫై ఎనేబుల్డ్ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ సీక్రెట్ కోడ్ లేదా పాస్‌వర్డ్ అడుగుతుంది. అప్పుడు ఆ కోడ్‌ను ఎంటర్ చేసి, ఓకే చేయగానే వైఫై నెట్‌వర్క్‌కు ఆయా పరికరాలు అనుసంధానం అవుతాయి.

వై-ఫై (Wi-Fi) సౌకర్యాలు:::
Wi-fi ఉపయోగించుకోగలిగితే ఒక్క బ్రాడ్‌బ్యాండ్(Broadband) కనెక్షన్‌తో మీ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ హ్యాండ్‌సెట్స్ అన్నిట్లోనూ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ సాధ్యమవుతుంది.   మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు ఎవరైనా బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్ నుంచి కనెక్షన్ తీసుకుని, వైర్‌లెస్ ఎన్ రూటర్ ద్వారా మీ ఇంట్లోని ల్యాప్‌టాప్, ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్లలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎన్ని వైఫై ఎనేబుల్డ్ పరికరాలనైనా ఉపయోగించుకోవచ్చు. నెలసరి బ్రాడ్‌బ్యాండ్ రెంటల్ ఒక కనెక్షన్‌కు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.

రూటర్లలో రకాలెన్నో..
వైఫై రూటర్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా సెల్యులార్ కంపెనీలు ఇంటర్నెట్ సర్వీస్(బ్రాడ్‌బ్యాండ్)ను కూడా అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కనెక్షన్‌తోపాటుగా ఈ రూటర్‌ను కూడా అమర్చుతాయి. మరికొన్ని కంపెనీలు బయట మార్కెట్‌లో కొనుక్కోవాలని వినియోగదారులకు సూచిస్తాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో డి-లింక్(D-link), నెట్‌గేర్(NetGear), ఐబాల్(i-ball), సిస్కో(Cisco), బెల్కిన్(Belkin) తదితర కంపెనీలకు చెందిన రూటర్లు అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, కంపెనీ ఇమేజ్‌ను బట్టి వైఫై రూటర్ల ధరలు రూ.1,350 నుంచి రూ.1,600 వరకు ఉన్నాయి. "అన్ని వైఫై రూటర్ల స్పీడ్ 150 ఎంబిపిఎస్ (మెగా బైట్స్ పర్ సెకన్) ఉంటుంది. ఒక్క సిస్కో రూటర్ స్పీడ్ మాత్రం 50 ఎంబిపిఎస్ ఉంటుంది.అయితే ధర కాస్త అధికమైనా వీటి వల్ల ఉపయోగం ఎక్కువగా ఉండడంతో చాలామంది వినియోగదారులు డి-లింక్, నెట్‌గేర్ తదితర కంపెనీలకు చెందిన వైఫై రూటర్లను కొనుగోలు చేస్తున్నారు.

వై-ఫై (Wi-Fi) సౌకర్యం లేకపోతే..?

ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న చాలా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లలో వైఫై సదుపాయం ఇన్‌బిల్ట్‌గానే ఉంటోంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు ఈ వైఫై సదుపాయం లేకపోతే, వైఫై యుఎస్‌బి అడాప్టర్ (Wifi USB Adapter) ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. ఈ రకం అడాప్టర్లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోనే ఉన్నాయి. వీటి ధర కూడా ఎక్కువేమీ కాదు. ఒక్కో వైఫై యుఎస్‌బి అడాప్టర్ ధర రూ.750 వరకు ఉండొచ్చు. ఈ అడాప్టర్‌ను సిపియు వెనుక భాగంలో ఉండే యుఎస్‌బి ఫీమేల్ ప్లగ్‌లో అమర్చడం ద్వారా సదరు కంప్యూటర్‌ను వైఫై నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావచ్చు.

How Can I Connect to WiFi on My Computer?

1.Click "Start." Type "devmgmt.msc" into the search bar. Press "Enter" to open Device Manager.

2.Expand "Network adapters." If there is no device with the words "WLAN," "Wi-Fi" or "Wireless LAN" in the name, your computer might not have a Wi-Fi card. Connect a USB wireless card to the computer and install the device to enable wireless capabilities on your PC.

3.Click "Start." Right-click "Network." Select "Properties" from the contextual menu to open "Network and Sharing Center..Choose "Change adapter settings" from the left pane. Click "Wireless Network Connection."
Click "Enable this network device" if the option appears in the toolbar.

4.Click the arrow icon on the taskbar to view all of the programs in the notification area. Click the Wireless Network Connection icon to view a list of available Wi-Fi connections.Select a wireless hot spot from the list. Click "Connect." Enter the network password into the appropriate field, if required, then click "OK." Launch a browser and navigate to a Web site to confirm the connection works.


No comments: